టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో ఒకడిగా కొరటాల దూసుకుపోతున్నారు. అయితే కొరటాల సినిమా అంటేనే సోషల్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది అని తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమా కథపై అనేక రుమార్స్ వస్తున్నాయి. ఈ మధ్య వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీకేజీ కారణంగా కొంత ప్రాణనష్టం జరిగింది. అలాగే ఇంతకముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కూడా కలకలం సృష్టించింది. ఇక ఇదే కథతో కొరటాల-బన్నీ సినిమా వస్తుంది అని ప్రచారం జరుగుతుంది. విడుదల చేసిన పోస్టర్ లో కూడా సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు, ఆకాశంలో గద్దలు తిరుగుతున్నాయి.