HomeOTTOTT releases: బాలు గాని టాకీస్ నుండి అలనాటి రామచంద్రుడు దాకా.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

OTT releases: బాలు గాని టాకీస్ నుండి అలనాటి రామచంద్రుడు దాకా.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

Interesting OTT releases this week to binge watch
Interesting OTT releases this week to binge watch

OTT releases this week:

ఈ వారంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో సరికొత్త సినిమాలను, షోలను అందిస్తున్నాయి మనకి ఇష్టమైన OTT ప్లాట్‌ఫారమ్‌ లు Aha, Prime Video, Netflix. ప్రేమ కథల నుంచి రొమాంటిక్ కామెడీల వరకు, థ్రిల్లింగ్ డ్రామాల వరకు అన్ని రకాల జానర్‌లలో కథలు అందుబాటులో ఉన్నాయి. ఈవారం రిలీజ్ అవ్వనున్న అలాంటి సినిమాలు ఏంటో చూద్దాం.

బాలు గాని టాకీస్:

Aha Videosలో ఇప్పుడు ప్రసారమవుతున్న బాలు గాని టాకీస్ ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఈ చిత్రానికి విష్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. శివ రామచంద్రవరపు, సరన్య శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. స్మరన్ అందించిన సంగీతం, ఆదిత్య BN అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

భలే ఉన్నాడే:

ETV WINలో ప్రసారమవుతున్న భలే ఉన్నాడే ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ పొందింది. అయితే, ETV WINలో అక్టోబర్ 3, 2024న విడుదలైన తర్వాత ఈ చిత్రం మంచి స్పందనను అందుకుంటోంది.

35 – చిన్న కథ కాదు:

Aha లో ప్రసారమవుతున్న 35 – చిన్న కథ కాదు ఒక కుటుంబ కథా చిత్రం. సెప్టెంబర్ 5, 2024న థియేటర్లలో మంచి కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2024 నుండి Aha Videosలో అందుబాటులో ఉంది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం పిల్లల చదువు వల్ల ఎదుర్కొనే సమస్యల మీద ఆధారపడి తెరకెక్కింది.

కలింగ:

హారర్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి కాలింగ సినిమా మంచి ఛాయిస్. అక్టోబర్ 4, 2024న Aha Videosలో విడుదలైన ఈ హారర్ డ్రామాలో ధ్రువ వాయు, ప్రగ్యా నయన్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ఒక అనాథ అయిన వ్యక్తి ప్రేమలో పడిన తర్వాత అతని జీవితంలో జరిగిన మార్పులను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపిస్తారు. సెప్టెంబర్ 13, 2024న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది, కానీ OTTలో మంచి ఆదరణ అందుకుంది.

అలనాటి రామచంద్రుడు:

Prime Videoలో ప్రసారమవుతున్న అలనాటి రామచంద్రుడు ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఆగస్టు 2, 2024న థియేటర్లలో విడుదలైనప్పటికీ, సెప్టెంబర్ 28, 2024 నుండి Prime Videoలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్‌లలో యావరేజ్ రెస్పాస్న్ పొందినప్పటికీ, OTTలో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

Read More: Viswam సినిమా విషయంలో ఆ ట్విస్ట్ ని సీక్రెట్ గా ఉంచిన దర్శక నిర్మాతలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu