Prabhas Upcoming Movies:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక మాట ఇచ్చారు. సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల చేస్తాను అని ప్రమాణం చేశారు. ఆ మాట మీద నిలబడుతూనే.. ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభాస్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
ప్రభాస్ హను రాఘవపూడి:
నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఈ మధ్యనే ఓకే అయింది. కానీ మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకి వెళ్లబోతోంది. పీరియడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమా.. ఎప్పుడూ విడుదలవుతుందా అని.. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజా సాబ్:
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న.. హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. ఈ మధ్యనే విడుదలైన చిత్ర ఫ్యాన్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలాకాలం తర్వాత రొమాంటిక్ లుక్ తో ప్రభాస్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కు సిద్ధం అవుతోంది.
స్పిరిట్:
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి ఇంటెన్స్ సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమానే స్పిరిట్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ వంగా ముందు ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారని అన్నారు.
సలార్ 2:
వరుసగా ప్రభాస్ డిజాస్టర్లు అందుకుంటున్న సమయంలో.. సలార్ సినిమా ఫ్యాన్స్ కి ఊరటనిచ్చింది. ప్రశాంత్ నీరు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకి రెండవ భాగంగా తెరకెక్కుతున్న సినిమా సలార్ 2.
కల్కి 2898 AD పార్ట్ 2:
మధ్యకాలంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.