హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 2023లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు. అయితే వీళ్ల సినిమాలన్నింటినిలోనూ శృతిహాసన్ ఉంది. అలా ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మోస్ట్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది శృతిహాసన్.
అయితే తాజాగా ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్‌లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు.. తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ శృతిహాసన్‌పై కామెంట్స్ చేశాడు.
అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని, తనతో కూడా రూడ్‌గా ప్రవర్తించిందని ఒర్రీ చెప్పాడు. శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతిహాసన్.. ‘నేను పెళ్లి చేసుకోలేదు. అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది’ అని ఒర్రీ కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చింది.