The Raja Saab Updates:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం రాజా సాబ్ పై పూర్తి దృష్టి సారించారు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు, ఇది ఒక హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
సినిమా కోసం ప్రత్యేకంగా సెట్‌ను నిర్మించి, అక్కడే షూటింగ్ యొక్క ముఖ్యభాగాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి రాజా సాబ్ షూటింగ్ మొత్తం పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
View this post on Instagram
క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని టీం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ సందర్భంలో మాస్ నెంబర్ తో కూడిన మొదటి సింగిల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ చిత్ర ప్రమోషన్లు మార్చి నెలలో ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 10న రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మాణం కొనసాగుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇకపోతే, ప్రభాస్ మరో ప్రాజెక్ట్ అయిన ఫౌజీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజా సాబ్ సినిమాలోని హారర్ కామెడీ అంశాలు, ప్రభాస్ మాస్ అప్పీల్‌కి తగ్గట్టే ఉండబోతున్నాయి.
ALSO READ: Bigg Boss 8 Telugu లో టాప్ 5 జాబితాలో ఉన్న హౌస్ మేట్స్ వీళ్ళే!