Devara OTT release date:
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా దేవర: పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.
అయితే Devara ఓటిటి విడుదల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాను ఓటీటీలో చూడాలనుకునే అభిమానులు, దాదాపు 50 రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. థియేట్రికల్ విడుదల తర్వాత హిందీ వెర్షన్‌కు 8 వారాల గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదలకు అవకాశం ఉంటుంది.
దీని వెనుక కారణం నేషనల్ మల్టీప్లెక్స్ చెయిన్లతో కుదుర్చుకున్న ఒప్పందం. ముఖ్యంగా హిందీ వెర్షన్ ధియేటర్ విడుదల అయిన 50 రోజుల తరువాత డిజిటల్ రిలీజ్ ఉంటుంది. ఇది ఫ్యాన్స్ దృష్టిలో కొంచెం ఆలస్యం అవుతున్నట్టే అయినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వెయిటింగ్ తప్పదు.
ఈ సినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శృతి మరాఠే, మురళి శర్మ, తల్లూరి రమేశ్వరి, అజయ్, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం మరో ఆకర్షణీయ అంశం.
దేవర: పార్ట్ 1 ప్రేక్షకులను అద్భుతమైన కథనంతో కట్టిపడేస్తుందని, సినిమా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి హైలైట్ అవుతాయి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.