విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒకప్పుడు రోజుకు రూ.14 కిలోమీటర్లు పరిగెత్తేవాడినని తెలిపారు. ఆయన నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ రహస్యం గురించి ముచ్చటించారు. ఆహారం విషయంలో ఏ మాత్రం రాజీపడనని, పరిమితులు లేకుండా నచ్చినంత తింటానని అన్నారు.
‘ఆహారం విషయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేను. నా తిండి గురించి, నాకంటే నాకు దగ్గరి వాళ్లు బాగా వివరిస్తారు. ఓసారి నేను తినే తిండి చూసి.. శివాజీ సర్ షాక్ అయ్యారు. గతంలో సరైన శరీరాకృతి కోసం రోజుకు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని. కానీ నాకు ప్రమాదం జరిగిన తర్వాత అంత దూరం పరిగెత్తలేకపోతున్నా’ అని ఆయన తెలిపారు.
అనంతరం తన సినిమా ‘అభయ్’ లో పాత్ర కోసం కండలు పెంచిన విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో సన్నగా కనిపించాలని తొలుత నేను అనుకున్నా. కానీ నా స్నేహితులకు నా ఆలోచన నచ్చలేదు. ఆ పాత్ర కోసం మాంసాహారం బాగా తీసుకున్నా. రోజుకు 32 గుడ్లు (తెల్లసొన), ఉడికించిన చికెన్ తీసుకునే వాడ్ని. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాకు గుడ్లపై విరక్తి వచ్చేసింది. ఓ సంవత్సరంపాటు వాటి జోలికే వెళ్లలేదు’ కమల్ గుర్తు చేసుకున్నారు. కమల్ ‘శభాష్ నాయుడు’, ‘భారతీయుడు 2’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.