
Rana Daggubati networth:
బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కేవలం నటుడిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా నిలిచారు. నటనతో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, బిజినెస్ వెంచర్స్ ద్వారా ఆయన గొప్ప ఆదాయం సంపాదిస్తున్నారు.
2025లో రానా నికర ఆస్తులు
రానా నికర ఆస్తులు రూ.100-150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆయన వార్షిక ఆదాయం రూ. 8 కోట్ల వరకు ఉండగా, నెలకి సుమారు రూ. 50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమా కోసం రానా రూ.10-15 కోట్ల పారితోషికం తీసుకుంటూ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరిగా ఉన్నారు.
దగ్గుబాటి కుటుంబ ఆస్తులు రూ.3000 కోట్లకు పైగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంపద వెనుక రామానాయుడు, వెంకటేష్, సురేష్ బాబు లాంటి కుటుంబ సభ్యుల కృషి ఉంది. రామానాయుడు స్థాపించిన రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, వెంకటేష్ విజయవంతమైన కెరీర్ ఈ ఆర్థిక స్థిరత్వానికి కారణాలు.
రానా సిఇఎట్స్ టైర్స్, యూబోన్, రామ్రాజ్ కాటన్, కోకాకోలా స్మార్ట్ వాటర్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉండి, ఒక్కో బ్రాండ్ కోసం రూ.70-80 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.
రానా వ్యాపారాల్లోనూ విజయవంతం అయ్యారు:
సౌత్ బే: ప్రత్యేకమైన కంటెంట్ క్రియేషన్ కోసం ఒక ప్లాట్‌ఫామ్.
టాలెంట్ మేనేజ్‌మెంట్: క్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యం.
ఐకాన్స్: వంచర్ క్యాపిటల్ కంపెనీలో వాటా.
రానా ఫిల్మ్ నగర్, హైదరాబాద్‌లోని ఓ అద్భుతమైన లేక్ వ్యూ బంగ్లాలో నివసిస్తున్నారు. దీని విలువ సుమారు రూ.50 కోట్లు. ఆయన కార్ల కలెక్షన్‌లో బిఎండబ్ల్యూ 7-సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, మెర్సిడెస్-బెంజ్ జిఎల్350 సిడిఐ, హోండా అకార్డ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఫిల్మ్ నగర్‌లోని ఓ రెస్టారెంట్ కూల్చివేత కేసులో రానా కుటుంబంపై ఆరోపణలు ఉన్నప్పటికీ, రానా తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ద రానా దగ్గుబాటి షో అనే వెబ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ALSO READ: sankranthiki vasthunnam రిజల్ట్ తో ఈ ఐదుగురు చాలా హ్యాపీ!