భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అలాగే ఈ వైరస్ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,411 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 10 వేల మంది కరోనా బారినుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 37,776కి చేరింది. తాజాగా 71 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,223కి చేరింది. 26 వేల మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దేశంలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.
దేశంలోనే అత్యధికంగా 11,506 మంది కరోనా బాధితులు, 485 మంది మృతులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ 4721, ఢిల్లీ 3738, మధ్యప్రదేశ్ 2719, రాజస్థాన్ 2666, తమిళనాడు 2526, తెలంగాణ 1057, ఏపీ 1525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.