
India Income Brackets:
భారతదేశం ఓ భారీ ఆర్థిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఒక్కో కుటుంబం ఒక్కో రేంజ్‌లో ఉంటుంది. మీరు మిడిల్ క్లాస్ అనుకుంటున్నారా? లేక రిచ్ క్లాస్‌లో ఉన్నారా? అసలు ఎవరు ఏ వర్గానికి చెందారు అనేది చూద్దాం:
1. దిగువ మధ్య తరగతి (Lower Middle Class)
ఈ వర్గానికి చెందినవారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి ₹1.5 లక్షల నుంచి ₹4 లక్షల మధ్య ఉంటుంది. వీరు ఎక్కువగా ఖర్చు జాగ్రత్తగా చేస్తారు. సరుకుల ధరలు పెరిగితే బడ్జెట్ దెబ్బతింటుంది. నెలకు ₹2,000 దాటని పొదుపు ఉంటుంది. పిల్లలు ప్రభుత్వ లేదా చౌకగా ఉండే ప్రైవేట్ స్కూళ్లలో చదువుతారు. ఆరోగ్య పరంగా ప్రభుత్వ పథకాలు ఆధారపడతారు. ప్రయాణం బస్సులు, నాన్-ఏసీ రైళ్లలోనే.
2. మధ్య తరగతి (Middle Class)
ఇవాళ ఎక్కువ మంది ఉన్న ఈ వర్గంలో ఆదాయం ₹4 లక్షల నుంచి ₹12 లక్షల మధ్య ఉంటుంది. వీరు కొంతమేర ఖర్చులను చూసుకుంటూనే జీవిస్తారు. పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించగలుగుతారు. సాదారణ ఆరోగ్య బీమా ఉంటుంది. నెలకు ₹5,000-₹10,000 పొదుపు ఉంటుంది. బేసిక్ కార్ కొనగలుగుతారు. ప్రయాణంలో మూడు టియర్ ఏసీ ట్రైన్ లేదా అన్‌ప్లాన్డ్ ఎయిర్ ట్రావెల్ ఉంటుంది.
3. పై తరగతి (Upper Middle Class)
ఈ వర్గంలో ఆదాయం ₹12 లక్షల నుంచి ₹40 లక్షల మధ్య ఉంటుంది. వీరు ఖర్చును పెద్దగా లెక్క చేయరు. మంచి ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తారు. మంచి ఆరోగ్య బీమా ఉంటుంది. మూడున్నర కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ ఉంటుంది. వీరు టూ టియర్ ఏసీ లేదా ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాలు చేస్తారు. మధ్యస్థాయి కార్లు, సంవత్సరానికి ఓసారి అంతర్జాతీయ వెకేషన్ వీరి జీవితంలో భాగం.
4. ధనిక వర్గం (Rich)
వీరి ఆదాయం ₹40 లక్షల నుంచి ₹5 కోట్లు ఉంటుంది. లగ్జరీ జీవితం వీరిది. పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతారు. బీమా అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఆరోగ్య ఖర్చులు మోస్తారు. రూ. 3 కోట్లు నుంచి రూ. 12 కోట్లు విలువైన విలాసవంతమైన ఇళ్లు కలిగి ఉంటారు. బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం చేస్తారు. అత్యంత ఖరీదైన కార్లు వీరి సొంతం.
5. అత్యంత ధనికులు (Super Rich)
వీరి ఆదాయం ₹5 కోట్లు దాటుతుంది. వీరు ఎలాంటి ధరల పెరుగుదలకూ భయపడరు. పిల్లలు విదేశాల్లో అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో చదువుతారు. రూ. 20 కోట్లు పైబడిన విల్లాలు ఉంటాయి. ప్రైవేట్ జెట్, ఫస్ట్ క్లాస్ ఎయిర్ ట్రావెల్, ఖరీదైన హోటళ్లలో విహారం వీరి జీవిత విధానం.
6. బిలియనీర్లు (Billionaires)
వీరు నలుగురికీ తెలియని పేరు గలవారు. ప్రపంచ వ్యాప్తంగా అతి ఖరీదైన ఆస్తులను కలిగి ఉంటారు. పిల్లలు ఐవీ లీగ్ కాలేజీల్లో చదువుతారు. ప్రైవేట్ మెడికల్ టీమ్ ఉంటుంది. ప్రభుత్వాలకూ వీరి మాటకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రైవేట్ జెట్లు, యాచ్ట్‌లు, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాపర్టీలకు యజమానులు వీరు.
ALSO READ: Pawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?