Who is the Richest Female Singer in India:
భారతీయ సంగీత ప్రపంచం ఎందరో ప్రతిభావంతులైన గాయకులను చూసింది. కానీ టాలెంట్‌తోపాటు సంపద విషయంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత సంపన్న గాయని తులసి కుమార్. ఆమె పేరు అంతగా తెలియకపోయినా, తెలివైన వ్యాపార నిర్ణయాలతో ఈ స్థాయికి చేరుకున్నారు.
తులసి కుమార్, టీ-సిరీస్ కుటుంబానికి చెందిన ఆమెకు రూ. 200 కోట్లకు పైగా నికర విలువ ఉంది. గుల్షన్ కుమార్ కుమార్తెగా తులసి, గాయని మాత్రమే కాకుండా టీ-సిరీస్ కుటుంబ వ్యాపారంలో భాగస్వామి.
ఇక కిడ్స్ హట్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నిర్వహించడం ద్వారా ఆమె అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ చానల్ పిల్లల కోసం రైమ్స్, కథలు అందిస్తోంది. ఆర్థికపరంగా తులసి బాలీవుడ్ స్టార్‌లను కూడా మించి నిలబడ్డారు.
View this post on Instagram
తులసి 2006లో చుప్ చుప్ కే చిత్రంలోని మౌసమ్ హై బడా కాటిల్ పాటతో గాయనిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత భూల్ భులయ్యా, రెడీ, దబాంగ్, కబీర్ సింగ్ వంటి సినిమాల్లో సూపర్‌హిట్ పాటలు పాడారు. 2000ల ప్రారంభంలో హిమేష్ రేషమ్మియాతో పాడిన హమ్‌కో దీవాన కర్ గయే పాటలతో ఆమె పేరు ప్రఖ్యాతి పొందారు.
ఇతర ధనవంత గాయనులు
తులసి తర్వాత ఇతర గాయనిలు కూడా ఆకర్షణీయమైన సంపదను సంపాదించారు:
శ్రేయా ఘోషల్: రూ. 180-185 కోట్లు
సునిధి చౌహాన్: రూ. 100-110 కోట్లు
ఆషా భోంస్లే: రూ. 80-100 కోట్లు
ALSO READ: బోట్ లో అరెస్ట్ అయిన Shahrukh Khan.. వైరల్ అవుతున్న Pawan Kalyan మీమ్స్!