చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపధ్యంలో ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ రంగంలోకి దిగి దాడులను విస్తృతం చేసింది. అన్నాడీఎంకె పార్టీ, శరత్ కుమార్ కు మధ్య డబ్బు మార్పిడి జరిగిందనే అనుమానాలతో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంలో శరత్ కుమార్ ను ప్రశ్నించిన ఐటీ శాఖ మంగళవారం ఆయన భార్య రాధికకు చెందిన రాడాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పై దాడి చేశారు.
రాడాన్ మీడియా ద్వారా రాధిక తమిళ టీవీ సీరియల్స్, సినిమాలను నిర్మిస్తున్నారు. రెండు రోజులు క్రితం రాధిక భర్త శరత్‌కుమార్ ఇంటితో పాటు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిపైనా ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే శరత్ కుమార్ ఇంట్లో డబ్బు దొరకలేదని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.