సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే నెల ఆగష్టు 9న పుట్టినరోజు జరుపుకోనున్నారు. బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. వైట్ అండ్ వైట్ సూట్‌లో మహేష్ బాబు స్టైల్‌గా నిలబడి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని భారీగా ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. హ్యాపీబర్త్ డే మహేష్ అనే హ్యాష్ ట్యాగ్ 24 గంటల్లో 31.1 మిలియన్ ల ట్వీట్స్ తో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ స్థాయిలో ఏదీ ట్రెండ్ అవ్వలేదు. ఓ 24 గంటల్లో మూడు కోట్ల ట్వీట్స్ నమోదు అవ్వడం ఇండియన్ సెలబ్రెటీ చరిత్రలో ఫస్ట్ టైం అంటూ మహేష్ ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోతున్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ 2.7 కోట్ల ట్వీట్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డు కొద్ది కాలంలోనే తుడిచిపెట్టుకుపోయింది. ‘హ్యాపీ బర్త్ డే మహేశ్’ అనే హ్యాష్ ట్యాగ్.. ఇది 3 కోట్ల ట్వీట్స్ ను దాటేసి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు మహేషః ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆగస్టు 9న ఇంకెంతగా ట్రెండ్ చేసి.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనున్నారో అని చర్చించుకుంటున్నారు.