గోవా బ్యూటీ ఇలియానా త్వరలో స్వీట్స్ అండ్ బేకరీ చెయిన్ బిజినెస్ ప్రారంభించనుందని తెలిస్తుంది. తాజాగా ఇల్లీ చాక్లెట్ కేక్ తయారు చేసి దాని రెసిపీని ట్విట్టర్లో షేర్ చేసింది. ఆమెకు చాలా లైక్ లు వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుత లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్లు బేకరీలను ప్రారంభించాలనే ఆలోచనతోనే ఇలా ఇంట్రో ఇచ్చింది. తన పేరుతోనే ఈ బేకరి బ్రాండ్ ను ప్రారంభించనుందట. ఇప్పటికే ఇలియానా పేరుతో డిజైనర్ గార్మెంట్స్ బోటిక్ ఉంది. ముంబై హైదరాబాద్ లో దీనికి శాఖలు ఉన్నాయి.