ఇలియానా మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. గర్భం దాల్చినప్పటినుంచి బేబి బంప్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.
ఇటీవలే తనకు 9వ నెల నడుస్తొందని గర్భంతో ఏ పనీ చేయలేకపోతున్నానంటూ ఎంతో నీరసంగా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. అయితే ఇప్పటివరకు ఆ బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇలియానా వెల్లడించలేదు.
ఆమధ్య చేతిలో చేయి వేసిన ఫొటోను, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్లర్ చేసిన ప్రియుడి ముఖాన్ని చూపిస్తూ పోస్టులు పెట్టింది. కానీ అతడి ఫోటోను మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.
ఎట్టకేలకు ఇలియానా తన ప్రియుడి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. డేట్ నైట్ అంటూ లవ్ సింబల్‌ను జత చేసి ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను మొదటి సారి ఇన్‌స్టాలో పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అతడు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇలియానా చెప్పలేదు.
‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే పాపులర్ అయింది. ఆ తర్వాత పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు సాగలేకపోయింది. ఒక దశలో వరుస ఫ్లాప్‌లతో సతమతమైంది.గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ కూడా ఒకటి, రెండు సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు.