HomeTelugu Trendingప్రియుడి గురించి చెప్తూ ఇలియానా తొలిపోస్ట్

ప్రియుడి గురించి చెప్తూ ఇలియానా తొలిపోస్ట్

iliyana baby bump

నటి ఇలియానా తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాను తల్లికాబోతున్నట్టు ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇటీవలే బేబీమూన్‌కు వెళ్లి ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్టును చేసింది. తన ప్రియుడి గురించి తొలిసారి మాట్లాడింది. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తనకు తోడుగా నిలిచాడని, ధైర్యం చెప్పాడని, కన్నీళ్లు తుడిచాడని చెప్పింది.

తల్లి కావడం అనేది ఓ అపురూపమైన అనుభూతి. ఇలాంటి ఆనందాన్ని నేను పొందుతానని ఊహించలేదు. ఈ ప్రయాణాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అంది. నాలో ఒక జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతి చెందడం ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణించలేకపోతున్నా.. చాలారోజులు బేబీబంప్‌ను చూస్తూ త్వరలో నిన్ను కలవనున్నాను అంటూ అమితానందం పొందాను.

కొన్న కష్టమైన రోజులు.. వాటినుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా.. కొన్ని పరిస్థితులు గందరగోళానికి గురిచేశాయి.. మరికొన్ని నిస్సహాయతను కలిగించాయి. కన్నీళ్లు అపరాధభావం. అలాంటి సమయంలో చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకుంటానో తెలియదు గానీ ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్నా.

ప్రియుడి గురించి చెప్తూ.. నాగురించి నన్ను మరిచిపోయిన రోజుల్లో ఈ వ్యక్తి నాకు అండగా నిలిచాడు. నాలో ధైర్యం నింపాడు.. కన్నీళ్లు తుడిచేసి చిరునవ్వులు పూయించాడు. నాకు ఎప్పుడు ఏం కావాలో అర్ధం చేసుకుని నా చెంతనే నిలిచాడు. ఇకపై ఏదీ కష్టంగా అనిపించదు.. అంటూ ఇలియానా తన ప్రియుడి గురించి రాసుకొచ్చారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu