HomeTelugu Big Storiesతన అవయవాల పై హీరోయిన్ కామెంట్స్

తన అవయవాల పై హీరోయిన్ కామెంట్స్

Ileana latest instagram pho
టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల నటి ఇలియానా. తెలుగులోని టాప్ హీరోలందరి పక్కన రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్‌ బుల్ మూవీలో నటిస్తోంది. ఇలియానా షేప్ విషయంలో కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ విషయంలో కొంత డిప్రెష‌న్‌కు గురైంది. తన శరీరంలో ఎన్నో లోపాలు ఉన్న‌ట్లు బాధ‌ప‌డిన ఇలియానా ఇప్పడు ఆ లోపాలే ఆమెకు అందాలంటూ పేర్కొన్నారు దీనికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది ఇలియానా.

శరీరాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇన్‌స్టాలో పంచుకుంది ఇలియానా. ‘నా శరీరాకృతిపై ఎప్పుడూ ఆందోళన చెందుతున్నాను. ఎదుటి వారికి ఎలా కన్పిస్తున్నానో అని బాధపపడేదాన్ని. నా థైస్‌ చాలా పెద్దగా ఉంటాయని అనిపించేవి. నా హిప్‌‌ చాలా వెడల్పుగా ఉంటుందని, నా నడుము సన్నగా ఉండేదని అనుకునేదాన్ని, నా వక్షోజాలు చిన్నగా ఉంటాయని, నా పొట్ట అనుకున్నంత బాగుండదని, భుజాలు బలహీనంగా ఉంటాయని అనిపించేది. పెదాలు అందంగా లేవని, నేను ఎక్కువ ఎత్తు ఉండనని బాధపడేదాన్ని. అసలు నేను పర్‌ఫెక్ట్‌ కాదని అభిప్రాయపడేదాన్ని.. అంటూ ఇన్‌స్టాలో వెల్లడించింది.

త‌న స‌హ‌జ‌మైన అందాలే త‌న‌కు అట్రాక్ష‌న్ అని, తనలోని ప్రతి మచ్చను అందంగా భావిస్తున్నట్లు తెలిపింది. తనలోని లోపాలనే తన అందంగా మలుచుకున్నట్లు తెలిపింది. ప్రపంచం ఏదైతే అందం అనుకుంటుందో దానిగురించి నేనెందుకు ఆలోచించాలి? దానికోసం నేనెందుకు మారాలి. నా అందం నాదే. నాకు నేనుగా నిలబడ్డాను’ అంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu