గోవా బ్యూటీ ఇలియానా తల్లి అయిన సంగతి తెలిసిందే. మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి కాకుండానే.. తల్లి కావడమేంటి.. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరనే సందేహం అందరినీ తొలిచివేసింది.
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం తన కొడుకు తండ్రిని సోషల్ మీడియా ద్వారా ఇలియానా పరిచయం చేశారు. తాను గర్భవతిని అని ప్రకటించడానికి కొన్ని వారాల ముందే మిచెల్ డోలెన్ ని వివాహం చేసుకున్నానని ఆమె తెలిపింది. మరోవైపు ఇలియానా తన జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త, కొడుకుతో కలిసి ఇండియాను విడిచి వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలియానా అమెరికాలో సెటిల్ కావాలని నిర్ణయించుకుందని సమాచారం.