గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య అవకాశా బాగా కోల్పోయిన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ ఉన్నట్టుండి తన శరీర బరువును పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్య తన గ్లామర్ ను మళ్లీ పెంచేసింది. జిమ్ములు, యోగాలు చేస్తూ శరీర బరువును తగ్గించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఫొటోలు బాగా షేర్ చేసుకుంటోంది. ఇక ఇండస్ట్రీ పట్ల కూడా బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది.
తాజాగా సినీ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇలియానా. సినీ ఇండస్ట్రీ క్రూరమైనది అంటూ ఇక్కడ అవకాశాలు అందడంలో సమానత్వం ఉండదని తెలిపింది. ఇందులో పాపులారిటీనే బిగ్ ఫాక్టర్ అంటూ, ఎప్పుడైతే పాపులారిటీ కోల్పోతారో.. అప్పుడే ఇక్కడ అవకాశాలు కూడా ఉండవని తెలిపింది. ఇక తన విషయంలో కూడా అదే జరిగింది అంటూ అభిమానులతో పంచుకుంది. ఇటువంటి క్రూరమైన పరిస్థితులు ఉన్నచోట నిలబడడం కష్టమని తెలిపింది. ఇక ప్రస్తుతం ఇలియానా ఫేర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తోంది.