HomeTelugu Trendingఇలియానా డిజిటల్‌ ఎంట్రీ

ఇలియానా డిజిటల్‌ ఎంట్రీ

Ileana dcruz entry in web
గోవా బ్యూటీ ఇలియానా డిజిటల్ బాట పట్టింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అనేక సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. చాన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా వెలిగొందిన ఈ గోవా బ్యూటీ తర్వాత డీలా పడింది.  ‘బాలీవుడ్’లో తన అదృష్టని పరీక్షించుకుంది. అక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా ఈ అమ్మడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ది ఫేమ్ గేమ్’ డైరెక్టర్ కరిష్మా కోహ్లీ ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు.

అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు ఈ సిరీస్ ను కలిసి నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో ఈ సిరీస్‌ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇలియానా చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu