గోవా బ్యూటీ ఇలియానా.. టాలీవుడ్‌లో ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఈ గోవా బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్లు ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ సోదరుడుల సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.
https://www.instagram.com/p/CgE2FYgvUYP/?utm_source=ig_web_copy_link