Ilaiyaraaja: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. గురువారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రలో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో పరస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. భవతరణి భౌతికకాయాన్ని రేపటిలోగా చెన్నైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భవతారిణి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా ఎంట్రీ ఇచ్చారు.