HomeTelugu NewsIlaiyaraaja: ది కింగ్ ఆఫ్ మ్యూజిక్‌గా ధనుష్

Ilaiyaraaja: ది కింగ్ ఆఫ్ మ్యూజిక్‌గా ధనుష్

Ilayaraja biopic announcedIlaiyaraaja: ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాని అధికారిక ప్ర‌క‌టించారు. ఇళయరాజా జీవితచరిత్ర ఆధారంగా వ‌స్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్‌ మీరో ధనుష్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్‌ అరుణ్ మాథేశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నాడు.

ఈఏడాదిలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నారు. 2025లో ఈసినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ‘ఇళయరాజా’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఇళయరాజా పోస్ట‌ర్‌ను ధ‌నుష్ ఎక్స్ వేదిక‌గా విడుదల చేశాడు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సంగీత దర్శకుడు అవుదామ‌ని మ‌ద్రాస్ న‌గరం కు వచ్చిన ఇళయరాజా పాత్ర‌ను చూడ‌వ‌చ్చు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu