HomeTelugu Big Storiesలేటు వయస్సులో ఘాటు ప్రేమ.. వైరల్‌

లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. వైరల్‌

12a
ప్రేమకి, వయస్సుకి సంబంధం ఏముంది? ..ప్రేమ ఎంత మధురం అని సూపర్‌ స్టార్‌ అంటుంటే.. అదే నిజం చేశాడు ఈ నటుడు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ గుర్తింపు పొందాడు నటుడు రాహుల్‌ దేవ్‌. ఆయన అనేక సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. కాగా రాహుల్‌, నటి మరియు మోడల్‌ ముగ్దా గాడ్సేతో డేటింగ్‌లో ఉన్నారు. గతంలో ఆయనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ సమ్మతమేనని అన్నారు. ఆమె ఢిల్లీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారని కూడా తెలిపారు. తన కుమారుడికి కూడా ఈ విషయం తెలుసని పేర్కొన్నారు.

కాగా 51 ఏళ్ల రాహుల్ 33 ఏళ్ల ముగ్దను ప్రేమించడం గురించి ప్రశ్నించగా ఆయన తాజాగా స్పందించారు. ‘2009లో నా భార్య క్యాన్సర్‌తో చనిపోయిన తర్వాత కెరీర్‌, నా కుమారుడి భవిష్యత్తుపై దృష్టి పెట్టా. కొన్నాళ్లకు నా స్నేహితుడి పెళ్లిలో ముగ్దను కలిశా. మాది తొలి చూపులోనే పుట్టిన ప్రేమకాదు. మొదట స్నేహితులయ్యాం, ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసేవాళ్లం. అలా బంధం దృఢపడింది. ఆపై తరచూ కలుసుకునేవాళ్లం. ఈ క్రమంలో ఇష్టం పుట్టింది. మా అమ్మ నాన్న కంటే పదేళ్లు చిన్నది. కాబట్టి నా విషయంలో 18 ఏళ్లు పెద్ద గ్యాప్‌ కాదనిపిస్తోంది. మనం సంతోషంగా ఉంటే.. వయసు తేడా, మిగిలినవి సమస్యే కాదని నా ఫీలింగ్‌’ అని ఆయన చెప్పారు.

రాహుల్‌ తన చిన్ననాటి స్నేహితురాలు రైనాను 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సిద్ధార్థ్‌ పుట్టాడు. బాబు 11 ఏళ్ల వయసులో రైనాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. దీంతో రాహుల్‌ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్‌ తీసుకుని ఆమెను చూసుకున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించి 2009లో రైనా కన్నుమూశారు.

12 6

Recent Articles English

Gallery

Recent Articles Telugu