జగన్ రెడ్డి పై భారీ వ్యతిరేకత ఉంది. ఉన్నా వైసీపీ పార్టీ అన్ని రకాల ఎలక్షన్స్ లోనూ గెలవడం ఆశ్చర్యంగా ఉంది. మరీ వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలు ఎలా ఉండొచ్చు ?. ఈ ప్రశ్నకి చాలామంది చాలా సమాధానాలు చెబుతూ ఉంటారు. కానీ సరైన సమాధానం ఏది ?, జగన్ రెడ్డి ఇక జన్మలో గెలవడు అని సగటు ఆంధ్రా ప్రేమికుడు బల గుద్ది చెబుతాడు. కానీ వీరి అభప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ఎలా ?, గెలుపు ఓటములు నిర్ణయించే పల్లె వాసులు ఓట్లు ఇక్కడ ప్రధానం. అసలు వాళ్లేం అనుకుంటున్నారు అనేది ప్రధానం.
వాళ్ళు అమాయకులు. వాళ్ళను జగన్ రెడ్డి మాయ చేస్తున్నాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. లోకేష్ తన పాదయాత్రలో ప్రధానంగా టార్గెట్ చేయాల్సింది పల్లె వాసులునే. అసలు గ్రామాల్లో వైస్సార్ కాంగ్రేస్ పాలన పై టాక్ ఎలా ఉంది. బాగోలేదు అని అన్నీ చోట్ల గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఈ పర్యాయం జగన్ రెడ్డికి మెజారిటీ తగొచ్చు, కానీ ఈ సారి కూడా కొన్ని ఏరియాల్లో జగన్ రెడ్డే గెలుస్తాడు అని వినిపిస్తోంది. ఇది వినడానికి కూడా ఆంధ్రా ప్రేమికుల మనసులు ఒప్పుకోవు. కానీ, నిజాలు అంగీకరించాలి.
అలా అంగీకరించలేం.. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ రెడ్డి మళ్లీ గెలవకూడదు అని కోరుకునే ప్రతి వ్యక్తి.. ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటో తెలుసా ?, కొన్ని పాయింట్లును జనం గుండెల్లోకి తీసుకువెళ్ళాలి. మరి ఆ పాయింట్లు ఏమిటో చూద్దాం రండి.
టీడీపీ లేదా వేరే పార్టీలతో కలిసిన కూటమి గెలిస్తే ఇప్పుడున్న పధకాలు ఉంటాయా ?. ఈ అనుమానం మెజార్టీ వర్గాల్లో నేటికీ ఉంది. ఆంధ్రుల స్వార్థ పరులు అని ఓ నానుడి ఉంది. మరి ఈ నానుడి ప్రకారం.. తమకు అనుకూలంగా ఉన్న పథకాల విషయంలో ఎక్కువ మంది అనుమాన పడుతున్నారు. కాబట్టి.. ప్రజలకు మేలు చేసే పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయం అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా జనానికి అర్థం అయ్యేలా నమ్మేలా చెప్పగలగాలి.
అలాగే డబ్బులు, మద్యం , తాయిలాల విషయంలో జగన్ రెడ్డి కంటే.. మేమే ఎక్కువ ఇస్తాం అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా జనానికి అర్థం అయ్యేలా నమ్మేలా చెప్పగలగాలి.
అభివృద్ధి ముఖ్యమా ? లేదా ఉచితాలు ముఖ్యమా ? అని ప్రజలకు నీరసం తెప్పించకుండా.. ఉచితాలు అదనంగా ఉంటాయి అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా జనానికి అర్థం అయ్యేలా నమ్మేలా చెప్పగలగాలి.
ప్రధాన నాయకుడిని చూసి ఓటు వేయండి అని, లేక మా నాయకుల పట్ల సానుభూతి చూపండి అని రిక్వెస్ట్ లు చేయకుండా.. మేం గెలిస్తే.. మీకే ఎక్కువ ఉపయోగం అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా జనానికి అర్థం అయ్యేలా నమ్మేలా చెప్పగలగాలి.