టీడీపీకి ప్రతి ఊరిలో బలం ఉంది అంటారు. నిజమే. కానీ ఆ బలం సరైనా పద్దతిలో ఉపయోగించబడుతుందా?, వైసీపీ పాలనలో అన్నీ అపజయాలే. పైగా రోజురోజుకు జగన్ రెడ్డి బలహీన పాలన ఎక్కువ అవుతూ ఉంది. అయినా ఎందుకు టీడీపీ పోరాటం ఉండాల్సిన స్థాయిలో బలంగా ఎందుకు లేదు. టీడీపీ లాంటి గొప్ప పార్టీ ఉండి, చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు ఉండి కూడా టీడీపీ ఎందుకు వేగంగా లేవడం లేదు ?, ఈ కోణంలో ఆలోచిస్తే చాలా విషయాలే అర్థం అవుతాయి.
జగన్ రెడ్డి సీఎం కాకముందే.. ఎలాగైనా మా నాయకుడిని సీఎం చేసుకోవాలి అని ప్రతి వైసీపీ అభిమానిలో 100 % కసి ఉండేది. మరీ ఆ కసి టీడీపీ అభిమానుల్లో నేడు ఉందా ?, ఒకప్పటి వైసీపీ అభిమానుల్లో ఉన్న కసిలో 5% కూడా కనిపించడం లేదు నేడు టీడీపీ అభిమానుల్లో. ప్రతి దానికి నాయకుడు అది చేయడం లేదు, పార్టీ ఇది చెయ్యడం లేదు అని పార్టీ మీద ఆధార పడడం, నాయకుడి మీద నిందలు వెయ్యడం ఈ మధ్య టీడీపీ అభిమానులకు బాగా అలవాటు అయిపోయింది. అసలు అభిమానులుగా కార్యకర్తలుగా ఏం చెయ్యగలమో అది చేయండి.
టీడీపీ అభిమానుల్లారా ఆలోచించండి. జగన్ ఫెయిల్యూర్స్ ఇన్ని వేలల్లో ఉన్నా.. అందులో నుంచి ఒక్క దాన్ని అయినా జనాల్లోకి మీరు బలంగా తీసుకెళ్లగలిగారా ?. అదే టీడీపీ పాలనలో మహిళల మీద దాడులు అనగానే వనజాక్షి రిషితేశ్వరి అని టక్కున మీరే చెప్తారు. మరీ వైసీపీ పాలనలో కొన్ని వందలమంది మహిళల మీద దాడులు జరిగాయి. కాదు కాదు, అత్యాచారాలు, అరాచకాలు జరిగాయి. మరీ వారిలో ఒకరిద్దరి పేరును అయినా మీరు టక్కున మీ మైండ్ లో ఊహించుకోండి. సరే పోనీ.. ఓ ఐదు నిమిషాలు ఆలోచించి చెప్పండి.
ఏ.. ?, ఏ పేర్లు మీ మైండ్ లోకి తట్టట్లేదు కదా. అంటే.. జగన్ పాలనలో ఏ ఆడపడుచు ఏ ఇబ్బందీ పడలేదా?, ఇక్కడే తెలియడం లేదా టీడీపీ అభిమానల ఫెయిల్యూర్ ఏమిటో ?. ఇలాగే ప్రతిసారీ అభిమానులు ఫెయిల్ అయ్యి అధినాయకుడి పై, పార్టీ పై నిందలు ఎలా వేస్తారు?. గుర్తుపెట్టుకోండి. రేపటి టీడీపీ గెలుపు, నేటి వైసిపి పై పోరాటమే. రేపటి మార్పు కోసం ప్రజలను మీ పార్టీ వైపు మీ అధినాయకుడి వైపు చూసేలా చేయండి. కనీసం బలంగా ప్రయత్నం చేయండి. వైసీపీ జగన్ చేసే ప్రతీ తప్పూ జనాల మెదడ్లలో రిజిష్టర్ అయ్యే విధంగా పదాలు అల్లండి. మీ గాత్రాలు విప్పండి. మీరు గట్టిగా పోరాడితేనే.. ప్రభుత్వ వ్యతిరేక సెగలన్నీ ఎగసి పడతాయి. అప్పుడే ప్రజలకు జగన్ అనే పీడ వదులుతుంది.