ఆంధ్రాలో బీజేపీ ఎందుకు ఎప్పటిలాగే ఇంకా మౌనంగానే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ జెండాను నిలబెట్టలాని బీజేపీ నాయకులు గట్టిగానే పోరాడుతున్నారు ఒక్క ఆంధ్ర తప్ప. కారణం ఏమిటి ?, ఆంధ్రకి ఇండియాలో ప్రాధాన్యత లేదా ?, లేక ఆంధ్ర ఎవరి చేతుల్లో ఉన్నా మద్దతు తమకే అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా ?, బీజేపీ ప్రస్తుతం జనసేన తో మాత్రమే పొత్తులో ఉంది. ఒకవేళ జనసేన కానీ టీడీపీతో కలవాలని నిర్ణయించుకుంటే.. మరి అప్పుడు బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా ?, వెళ్తే డిపాజిట్లు కూడా రావు అన్న విషయం మోదీకి తెలియంది కాదు.
పోనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ?.. ఇందుకు ఆ రెండు పార్టీల ఇమేజ్, భావజాలం సరిపోదు. కాబట్టి.. బీజేపీ ముందున్న ఏకైక అవకాశం జనసేన – టీడీపీలతో కలిసి వెళ్లడమే. ఐతే, గతంలో బీజేపీకి టీడీపీ తో స్నేహం చెడింది. ఇక టీడీపీతో కలిసి మళ్లీ ఎన్నికల కు వెళ్ళాలి అంటే.. చాలా లెక్కలు ఉంటాయి. కానీ, 15 ఎంపీ సీట్లు టీడీపీ నుంచి బీజేపీకి ఆఫర్ ఉంది అని టాక్. అదే నిజం అయితే.. మళ్లీ బీజేపీ – టీడీపీ కలుస్తాయి. ఐతే, గత ఎన్నికల్లో 150 పైగా సీట్లు సాధించిన జగన్ పార్టీకి, జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్రం ఇప్పటివరకు ఏమి చేయలేదు.
ఒకవేళ బీజేపీ – టీడీపీ – జనసేన పొత్తు కుదిరితే.. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో మళ్లీ కదలిక రావొచ్చు. కానీ మోదీ ఆ దిశగా అడుగులు వేస్తాడా ? అనేదే అనుమానం. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డి మాటలు నమ్మి ఓట్లు వేశారు. ఈ సారి కూడా నమ్మితే.. సో.. తమ వ్యతిరేక కూటమిలో జగన్ రెడ్డి కలవడం మోదీ – షా లకు ఇష్టం లేదు. అందుకే, జగన్ రెడ్డి విషయంలో కేంద్ర పెద్దలు నిదానంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి జగన్ కి – కేంద్ర పెద్దలకు మధ్య ఏదో లాలూచీ ఉందని ప్రచారం జరుగుతుంది.
వంకలేనమ్మ డొంక పట్టుకు ఏడ్చింది అన్నట్లు ఉంటుంది ఈ ప్రచారం. ఓ రాష్ట్రంలో ప్రజల మనోభావాలను బట్టే కేంద్రం అడుగులు వేస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికీ పరిస్థితులను బట్టి బీజేపీ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పనులు చేయాలా ? వద్దా ? అని నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇమేజ్ లు, భావజాలాలు పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల బాగు కోసం బీజేపీ సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. జగన్ రెడ్డిని క్షమిస్తే.. అతని తప్పుల్లో భాగం తీసుకున్నట్టే.. అలాగే లోకంలో పాపాలన్నీ నెత్తిన పోసుకోవడమే. కాబట్టి కేంద్ర పెద్దలు ఆ తప్పు చెయ్యరని ఆశిద్దాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం మోదీ – షా సిన్సియర్ గా ఉండాలని కోరుకుందాం.