టాలీవుడ్ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రంగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఏఐ స్టూడియోస్ .. శాస్త్రా మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, దర్శన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి తెలుగు తెరకి పరిచయం కానుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. వెంకట్ – వెన్నెల కిషోర్ – ప్రియదర్శి – అభినవ్ గోమతం – ఐశ్వర్య – నిఖిల్ కైలాస – కృష్ణ చైతన్య ఇతరులు ఇతర పాత్రలు పోషించారు.
#IchataVahanamuluNilupaRadu 🏍️
🅿️arking available ONLY AT THEATRES, Worldwide from August 27 ✅
🚧 #IVNRFromAug27th 🚧#IVNR #NoParking@AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies@_meenakshii @darshn2012 @Plakkaraju @mynnasukumar @iamHarishCK @adityamusic pic.twitter.com/g5utaAhieK
— Sushanth A (@iamSushanthA) August 13, 2021