HomeTelugu News'వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే ..పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు: చంద్రబాబు

‘వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే ..పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు: చంద్రబాబు

12 22014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు వస్తాయా? వృద్ధులకు పింఛన్లు వస్తాయా? అనే అనుమానం ప్రజల్లో కలిగిందని, కానీ ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు భారీగా చేశామని తెలిపారు. మొదటి పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చనే వెసులుబాటు ఉన్నా కేసీఆర్‌ చులకన ప్రవర్తన వల్ల ఏపీకి వచ్చేశామని గుర్తు చేశారు. ఒక్క హైదరాబాద్‌ పోయినా పర్లేదని మరో 20 హైదరాబాద్‌లు తయారు చేసే సత్తా తనలో ఉందని ఉద్ఘాటించారు. కానీ గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలిపించినందుకు ముఖ్యమంత్రి నిరాశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించినట్లే నెల్లూరులోనూ గెలిపించాలని అభ్యర్థించారు. పట్టిసీమ ద్వారా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీళ్లిచ్చానని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

‘వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే రూ.పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు. వీరు దేశానికి, రాష్ట్రానికి భారం. ఇక్కడ బీద మస్తాన్‌రావు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ నాయకుడు ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి ఏమైనా పోలిక ఉందా. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని చివరికి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈయన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. మోడీ.. కోడికత్తి జోడీ.. వీళ్లకు తెలంగాణలో మరో నాయకుడు కేసీఆర్‌ తోడు దొరికారు. కేంద్రంలో మోడీ గెలిస్తే ప్రజల జీవితాల్లో చాలా సమస్యలొస్తాయి. ఆయన ఆధునిక నియంత. అబద్ధాల కోరు అంటేనే నరేంద్రమోడీ. గాంధీ పుట్టిన గడ్డపై పుట్టారు. అహింసా మార్గంలో గాంధీ ఉంటే.. ఈయనది మాత్రం హింసా మార్గం.’

‘ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా నిరుద్యోగభృతి ఇస్తున్నాం. ఇప్పటివరకూ రూ.2 వేలు ఇస్తుండగా.. త్వరలోనే రూ.3 వేలు ఇస్తాం. డిగ్రీ చదివిన వారికే కాకుండా త్వరలో ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారికి కూడా అందిస్తాం.’
మహిళలందరికీ స్మార్ట్‌ ఫోన్‌లు ఇచ్చి యాప్‌ల ద్వారా పనులన్నీ స్మార్ట్‌గా చేయాలని నేను చూస్తోంటే.. జీతమిచ్చి ఊరికి పది మంది వాలంటీర్లని పెడతామని జగన్‌ అంటారు. నిన్న నేను పులివెందుల వెళ్లినప్పుడు అక్కడి జనాలు నీరాజనం పలికారు. వాళ్లంతా చాలా మంచి వాళ్లు. అభివృద్ధి, ఆదాయంలో రాష్ట్రంలో నెం.1 నియోజకవర్గం పులివెందులే అవుతుంది. లింగాల మండలం ఎక్కువ ఆదాయం వచ్చే మండలాల్లో మూడోది. పులివెందులకు నీళ్లిచ్చాను. దీంతో అరటికి ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి వచ్చేది ఇక్కడే. కానీ పులివెందులలో జగన్‌ సేల్స్‌ ట్యాక్స్‌ (జేఎస్‌టీ) అని పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్లు మనకు కావాలా? జగన్‌తో నాకు పోలికా? నాకే సిగ్గేస్తోంది.’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జిల్లాలో తమకు సమస్యలున్నాయని కొంత మంది తన దృష్టికి తెచ్చారని కానీ తనకూ, రాష్ట్రానికి జగన్‌ సమస్య ఉందని ఎద్దేవా చేశారు. ఒక్కసారి గెలిపించాలని జగన్‌ ప్రాధేయపడుతున్నారని, గెలిపిస్తే మన భవిష్యత్తు ఏమవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu