ప్రధాని నరేంద్రమోడీకి చూయింగ్ గమ్ కానుకగా ఇస్తానంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. మనోజ్ ఇప్పటివరకు మోడీని కానీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కానీ కలవలేదట. ఇటీవల భారత ప్రభుత్వం మనోజ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకునేటప్పుడైనా తాను రాష్ట్రపతిని, మోడీని ఒకేసారి కలుస్తానని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.
‘నాకు మోడీజీ అంటే ఎంతో గౌరవం. ఆయన రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోగలుగుతున్నారు. అందుకే ఆయన్ని కలిసినప్పుడు చూయింగ్ గమ్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నేను వెటకారంగా చెబుతున్న విషయం కాదు. కనీసం చూయింగ్ గమ్ తింటేనైనా ఆయన కాసేపు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్ ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కాబోతుంది.