టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది కన్నడ భామ పూజా హెగ్డే దూసుకుపోతోంది. ఇదే సమయంలో బాలీవుడ్ లో సైతం ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. తాజాగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సరసన ఛాన్సులు కొట్టేసింది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
లాక్ డౌన్ సమయంలో ‘హోం క్వారంటైన్’ లో ఉండాల్సి వస్తే… మీరు నటించిన హీరోలలో ఎవరితో ఉంటారు? వారి నుంచి ఏం నేర్చుకుంటారు? అని ఓ నెటిజ్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, హృతిక్ రోషన్ లతో కలిసి నటించానని… అవకాశం వస్తే అందరు హీరోలను నిర్బంధంలోకి తీసుకుని వారి నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకుంటానని చెప్పింది.
ఒక్క హీరోనే స్వీయ నిర్బంధంలోకి తీసుకోవాల్సి వస్తే… హృతిక్ రోషన్ ను ఎంచుకుంటానని తెలిపింది. చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్ తన డ్రీమ్ హీరో అని చెప్పింది. బాలీవుడ్ లో తన తొలి హీరో ఆయనేనని…. ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకుంటానని తెలిపింది.