HomeTelugu Trendingనటుడిగా ఆ స్థాయికి ఎదగాలి: విజయ్‌ దేవరకొండ

నటుడిగా ఆ స్థాయికి ఎదగాలి: విజయ్‌ దేవరకొండ

11 8నటుడిగా ఓ గొప్ప స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చెప్పారు. ఆయన తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీరు ప్రతి సినిమాకు మీ నటనను మెరుగు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయంలో మీకు వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. దీనికి విజయ్‌ స్పందిస్తూ.. తన సినీ కెరీర్‌లోనే సూపర్‌ హిట్‌గా చెప్పుకునే ‘అర్జున్‌ రెడ్డి’ని కొన్నేళ్ల తర్వాత తను చూసినప్పుడు సిగ్గుపడాలని, నటుడిగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ అంటే నేను సిగ్గుపడే (నటుడిగా తన నైపుణ్యాన్ని ఉద్దేశిస్తూ) స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నా. ఇంకొన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా ‘అర్జున్‌ రెడ్డి’ నా ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే దానర్థం నేను ఎదగడం లేదని. ఈ వృత్తిలో నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి సినిమాకు ది బెస్ట్‌గా అవ్వాలనేది నా ఉద్దేశం. నేను చూసి ఎంజాయ్‌ చేసేలా ఉండే చిత్రాల్ని చేయాలని ఉంది’ అని ఆయన చెప్పారు.

అనంతరం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా గురించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో నేను చాలా ఉత్సుకతగా ఉన్నాను. ఇందులో నేను విద్యార్థి పాత్రను పోషించా. నూతన దర్శకుడు భరత్‌ కమ్మా తీసిన న్యూఏజ్‌ లవ్‌ స్టోరీ ఇది. వెండితెరపై ఈ కథ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. నా అభిమానులు చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జులై 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని రెండో పాటను మే 15న ఉదయం 11.11 గంటలకు విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu