HomeTelugu Trendingజాన్వీ ప్రేమపై.. బోనీ కపూర్‌ స్పందన!

జాన్వీ ప్రేమపై.. బోనీ కపూర్‌ స్పందన!

2 29బోనీ కపూర్‌ పెద్ద కుమార్తె, నటి జాన్వీ కపూర్‌ నటుడు ఇషాన్‌ ఖత్తర్‌తో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి ‘ధడక్‌’ సినిమాలో నటించారు. ఇదే జాన్వీ తొలి సినిమా. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం తర్వాత ప్రేమగా మారిందని సమాచారం. దీనికి తగ్గట్టు జాన్వీ, ఇషాన్‌ ఫంక్షన్లు, డిన్నర్లకు కలిసి వెళ్తూ.. మీడియా కంటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వదంతులు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

జాన్వీ ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై బోనీ స్పందించారు. ఇవన్నీ కల్పితాలని అభిప్రాయపడ్డారు. ‘అవును.. ఇషాన్‌, జాన్వీ కలిసి సినిమాలో నటించారు. అందుకే స్నేహితులు అయ్యారు. నాకు నా కుమార్తెపై గౌరవం ఉంది. ఇషాన్‌తో తన స్నేహాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు.

తెలుగు హిట్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌లో జాన్వీ, ఇషాన్‌ కలిసి నటించే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్‌లో చెప్పుకొచ్చారు. అయితే వారు తన సినిమాలో నటించడం లేదని దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పష్టం చేశారు. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతోపాటు రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కరీనా కపూర్, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరోపక్క ఆమె ‘కార్గిల్‌ గర్ల్‌’లోనూ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu