ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న తారల్లో హీరోయిన్ రష్మిక ఒకరు. విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తూనే మరోవైపు మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరులో నటిస్తోంది. వీటితో పాటు నితిన్‌తో భీష్మ సినిమాలో చేస్తోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో హీరోయిన్ రష్మిక మీడియా ముందు వెల్లడించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఆ చిత్రం ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని తెలిపింది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు భరత్ కమ్ముల దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.
డియర్ కామ్రేడ్ సినిమా ప్రచార కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు కాబోయే భర్త రొమాంటిక్‌గా ఉండాలని, తన భావనలను, ఇష్టాలను పంచుకోలేకపోయినా నిజాయితీగా ఉండాలని, అతడి ప్రవర్తన తనకు నచ్చాలని రష్మిక వెల్లడించింది. అన్నిటికన్నా మించి అతడు మంచి మనసున్నవాడై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి. నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదు అని తెలిపింది ఈ కన్నడ భామ. 2017లో కన్నడ నటుడు రక్షితో తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 2018లో దాన్ని రద్దు చేసుకుంది రష్మిక.