అక్కినేని నవ మన్మధుడు ‘అఖిల్’ మంచి హిట్ కోసం ఎదురు చుస్తున్నాడు. కానీ ఫాలోయింగ్ మాత్రం కొదవ లేదు ఈ కుర్ర హీరోకి. ఒక్క హిట్ తన ఖాతాలో లేకపోయినా అఖిల్ అంటే అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఓ యాంకరమ్మ అఖిల్ పై మనసు పారేసుకుందంట.
ఒంటిపై అఖిల్ గుర్తుగా టాటూలు కూడా వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. `పోరా – పోవే` ఫేమ్ విష్ణు ప్రియ తన లెఫ్ట్ హ్యాండ్పై అఖిల్ పేరుని టాటూగా వేయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఈ విషయం యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న ఓ టెలివిజన్ షోలో బయటపడింది. ఇందులో యాంకర్లు శ్రీముఖి, విష్ణు ప్రియ పాల్గొన్నారు. షోలో భాగంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్‌ని బయటపెట్టాలని యాంకర్ ఝాన్సీ ఈ ఇద్దరిని కోరింది. ముందు శ్రీముఖి తనకు సంబంధించిన సీక్రెట్స్‌తో పాటు విష్ణు ప్రియకు సంబంధించి సీక్రెట్స్ వున్నాయని చెప్పడంతో ఝాన్సీ ఒకటి బయటపెట్టమని అడిగిందంట. ‘ఒక వ్యక్తి విష్ణు ప్రియ లైఫ్‌లో చాలా స్పెషల్…దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరమని అడిగితే ఖచ్చితంగా అఖిల్ అక్కినేనితో పెళ్లి కావాలని విష్ణు ప్రియ అడుగుతుందని, కావాలంటే తన చేయిపై వున్న టాటూని చూడమని శ్రీముఖి అసలు సీక్రెట్ బయటపెట్టింది.