HomeTelugu Trendingనాకు జ్వరం మాత్రమే: నాగార్జున

నాకు జ్వరం మాత్రమే: నాగార్జున

10 22టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున.. తనకి జ్వరం తప్ప మరెలాంటి ఆరోగ్య సమస్య లేదనీ, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తన సన్నిహితులతో ఫ్యాన్ గ్రూపులో షేర్ చేయించారు. నాగార్జున ఈ విధంగా చేయడం వెనుక ఒక బలమైన కారణమే వుంది. నాగార్జున హీరోగా ఇటీవల ‘మన్మథుడు 2’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో యంగ్ లుక్ తో కనిపించడం కోసం నాగార్జున గట్టి కసరత్తులు చేశారు. ఈ వయసులో ఆయన ఎక్కువగా కసరత్తులు చేయడం వలన, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారనే టాక్ నిన్నంతా ఫిల్మ్ నగర్లో షికారు చేసింది. కీళ్ల నొప్పులతో చాలా బాధపడుతున్నారనే వార్త కూడా కొన్ని వెబ్ సైట్స్ లో జోరందుకుంది. ఈ ప్రచారం అంతకంతకూ పుంజుకుంటూ ఉండటంతో, స్వయంగా నాగార్జునే రంగంలోకి దిగిపోయి, తనకి జ్వరం తప్ప ఎలాంటి అనారోగ్య సమస్య లేదంటూ స్పష్టం చేయవలసి వచ్చింది. నాగార్జున ప్రస్తుతం స్టార్‌మా నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu