HomeTelugu Big Storiesసుశాంత్‌ తట్టుకోలేకపోయాడు నెపోటిజంపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్..

సుశాంత్‌ తట్టుకోలేకపోయాడు నెపోటిజంపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్..

5 14
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది. మానసిక ఒత్తిడి కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే ఇది కాకుండా మరేవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. సోషల్‌ మీడియాలో సుశాంత్‌ పాత ఇంటర్వ్యూలకు సంబంధించి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో సుశాంత్ చిత్ర పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి గురించి మాట్లాడారు. ‘బంధుప్రీతి (నెపోటిజం) ప్రతి చోటా ఉంది. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. టాలెంట్‌ ఉన్న నూతన నటీనటుల్ని పోత్సహించకపోతే, వారి ఎదుగుదలకు అడ్డుపడితే సమస్యలు వస్తాయి. ఏదో ఒక రోజు చిత్ర పరిశ్రమ నిర్మాణం మొత్తం పతనం అవుతుంది’ అని సుశాంత్‌ ఓ అవార్డు వేడుకలో మీడియాతో అన్నారు.

కాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. చిత్ర పరిశ్రమ నుంచి ఏర్పడ్డ సమస్యల్ని తను తట్టుకున్నట్లుగా.. సుశాంత్‌ మాత్రం తట్టుకోలేకపోయాడని పేర్కొన్నారు. ‘నెపోటిజం మధ్యే నేనూ జీవిస్తున్నా. అయినా సరే రాణించగలుగుతున్నా. నాకు తగిలిన గాయాలు ఎంతో లోతైనవి. కానీ వయసులో చిన్నవాడైన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ వాటిని భరించలేకపోయాడు. బాధల నుంచి పాఠం నేర్చుకుంటే.. తప్పకుండా లేచి నిలబడగలం. మన కలల్ని చంపుకోవాల్సిన అవసరం ఉండదు’ అని ఆయన తన మనసులోని మాటల్ని పంచుకున్నారు.

ఇదే కాకుండా మరో సందర్భంలోనూ సుశాంత్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో జరిగే ఏ పార్టీలకు తనను ఆహ్వానించలేదని, చిత్ర పరిశ్రమ నుంచి తనను వేరు చేసిన భావన కలుగుతోందని చెప్పారు. నెపోటిజంపై హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu