విశ్వ నటుడు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తెలుగు తమిళ భాషాల్లో నటిస్తూ ఓ వెలుగు వెలిగింది. అయితే శృతి నటించిన సినిమాలు వరుసగా ప్లాప్స్ కావడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ సినిమా అవకాశాలు పెద్దగా రావట్లేదు. దీనికి తోడు శృతి గతంలో కొంత కాలం ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్ చేసి.. ఆ తర్వాత విడిపోయారు. ఇవన్నీ కూడా శృతిని కుంగదీసాయనే చెప్పొచ్చు. దీంతో అడపదడపా సినిమా అవకాశాలు వచ్చిన కొన్నింటిని ఆమె వదిలేసిందని వినికిడి. శృతి కేవలం నటించమే కాదు.. తనో సంగీత దర్శకురాలుగా కూడా పేరు తెచ్చుకుంది. అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఈనాడు’ మూవీకి ఈ అమ్మడే సంగీతం అందించింది. అది అలా ఉంటే శృతి తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో.. తాను తాజాగా సర్జరీ చేసుకున్నానని తెలిపింది. అదీ మామూలు సర్జరీ కాదు ప్లాస్టిక్ సర్జరీ. అయితే ఇలాంటిదే గతంలో కూడా ఓ సారి సర్జరీ చేయించుకున్నదని టాక్.. కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. ‘నేను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసాను. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి మిగితా ఆడవాళ్లు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు’ అని తెలిపింది. “ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటంలేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం. ప్రేమను పంచండి. రోజూ నన్ను నేను కాస్తా ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో నాకుండే గొప్ప ప్రేమ కథగా భావిస్తాను. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నాను” అని తెలిపింది. శృతి ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుంది.