వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి నోరు జారింది. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. మెగా బ్రదర్ నాగబాబు గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ వివాదాన్ని మరింత రాజేస్తూ.. ‘బాలయ్యతో పెట్టుకుంటే మడత పెట్టేస్తాం’ అంటూ ఫేస్ బుక్‌లో వీడియోని పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.
ఈ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘చాలా మంది పవన్ గురించి మాట్లాడండి అంటున్నారు. పవన్ బార్న్‌వాల్ గురించి తెలుసు ఆయన మంచి పెయింటర్ ఏ పెయింట్ అయినా అలవోకగా వేసేస్తారు. ఆ పవన్ తప్ప నాకు మరే పవన్ కళ్యాణ్ తెలియదు అంటూ సంచలన కామెంట్స్‌తో వచ్చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. నాకు తెలిసింది ఆ పవన్. ఇక ఆయనతో పాటు చాలా మంది పవన్‌లు ఉంటారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నార్మల్ పర్సన్స్ చాలా మంది ఉంటారు. వాళ్లు ఎవరో తనకు తెలియందంటూ వ్యంగాస్త్రాలు విసిరింది శ్రీరెడ్డి. గతంలో బాలకృష్ణ తనకు తెలుసంటూ కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించి నాగబాబు ఎలాగైతే రియాక్ట్ అయ్యారో.. సరిగ్గా అదే కోవలో తనకు పవన్ బాన్వాల్ మాత్రమే తెలుసంటూ శ్రీరెడ్డి రియాక్ట్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో పోస్ట్ పెడుతూ.. ఆంధ్ర నుంచి కొందరు తనకు ఫోన్ చేసి పవన్ అంటే ఎవరో వివరించారని చెప్పుకొచ్చింది.
“ఇప్పుడే నాకు ఆంధ్ర నుంచి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. పవన్ అంటే దొంగచూపులు చూసుకుంటూ, దొంగ కోళ్లు పట్టేవారిలా ఉంటారట. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటారట. ఎప్పుడూ అబద్ధాలు చెప్పుకుంటూ, పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, దేశసేవ చేస్తానంటూ సొల్లు కొట్టుకుంటూ ఉంటారట. ఇలా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా చెన్నైలో తిష్టవేసిన శ్రీరెడ్డి.. జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కు లేదన్నారు. పొలిటికల్ గా చిరంజీవి కంటే జగన్ సీరియర్ అంటోంది. 12-13 ఏళ్ల పిల్లల్ని వెనకేసుకొని మీరు సోదిచెప్పి, వాళ్లతో అరిపించుకున్నంత మాత్రాన సీఎంగా అయిపోతానని అనుకోవడం బుల్ షిట్. యూఎస్ వెళ్లి డబ్బులు వద్దంటూ తీసుకోవడం, కులపిచ్చి లేదంటూ మీ కులాల్ని మెప్పించడం, అమ్మాయిల పిచ్చి లేదంటూనే వాళ్ల వెంటపడడం… ఇదేనా పవన్ అంటే.
పవన్ జీవితంలో ఏం చూసి యువత నేర్చుకోవాలని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఇకనైనా బాలయ్యను విమర్శించడం మానుకోవాలని, మాటలు అదుపులో పెట్టుకోవాలని సూచించింది.