గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్ గురించి విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి హీనాఖాన్ తనదైన శైలిలో నెటిజన్లకు ఛాలెంజ్ విసిరారు. హలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘గ్రామీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి నటి ప్రియాంక చోప్రా సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రియాంక వైట్ అండ్ క్రీమ్ కలర్‌లో ఉండే ఓ డ్రెస్‌ను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రియాంక డ్రెస్సింగ్ చాలా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక డ్రెస్ గురించి వస్తున్న ట్రోల్స్‌పై మరో బాలీవుడ్ నటి హీనాఖాన్ స్పందించారు. వేరొకరు ధరించిన డ్రెస్ గురించి కామెంట్ చేయడానికి మీరెవరూ అని ఆమె ప్రశ్నించారు. ‘గ్రామీ వేడుకకు ధరించిన దుస్తులు ప్రియాంకకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు.. కామెంట్ చేయడానికి మీరెవరూ?’ అని హీనా ఖాన్ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రియాంక డ్రెస్ గురించి ట్రోల్స్ చేస్తున్న వారికి హీనాఖాన్ ఓ ఛాలెంజ్ విసిరారు. ‘ప్రియాంక డ్రెస్ గురించి ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్లు.. ఆ దుస్తులను 10 నిమిషాలపాటు ధరించి చూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ డ్రెస్ ధరించడం అంత సులభంకాదు. అంతేకాకుండా డ్రెస్‌తో అంతపెద్ద వేడుకలో అందర్నీ మెప్పించడం, ఫొటోలకు పోజులివ్వడం అంత సాధారణమైన విషయం కాదు. అలాంటి డ్రెస్సులు ధరించాలంటే అందంతోపాటు ధైర్యం కావాలి.’ అని హీనా ఖాన్ పేర్కొన్నారు.