HomeTelugu Trendingవ్యాపారవేత్తతో డేటింగ్‌ ‌.. అదా శర్మ క్లారీటీ

వ్యాపారవేత్తతో డేటింగ్‌ ‌.. అదా శర్మ క్లారీటీ

3 26హీరోయిన్‌ అదా శర్మ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ భామ ప్రస్తుతం ‘కమాండో 3’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటించారు. ఆదిత్యా దత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా అదా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘మీరు తరచూ మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్న వీడియోలను షేర్‌ చేస్తుంటారు? దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘చిన్నప్పటి నుంచి నేను మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్నా. నృత్యం, జిమ్నాస్టిక్స్‌కు సంబంధించినది ఏదైనా నాకు ఇష్టమే. డ్యాన్స్‌, యాక్షన్‌ రెండూ ఒక్కటే అని నా ఫీలింగ్‌. నాకు కథకు వచ్చు. ఈ డ్యాన్స్‌లో భాగంగా వృత్తాకారంలో గిర్రున తిరిగి తర్వాత మళ్లీ మొదలైన స్థలం దగ్గరికే రావాలి. యాక్షన్‌లో కూడా అలానే ఉంటుంది కదా. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె నాకు ఎన్నో నేర్పించారు’ అని చెప్పారు.

అనంతరం ‘మీరు ఓ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి?’ అని ప్రశ్నించగా అదా షాక్‌ అయ్యారు. ‘కొత్తగా ఈ వ్యాపారవేత్త ఎవరు? నేను సింగిల్‌గా ఉన్నాను. నాకు సరిపోయే జీవిత భాగస్వామిని వెతికి పెట్టమని నా ఫ్యాన్స్‌ను కూడా ఇటీవల అడిగాను. అతడు దోస, చట్నీ పర్‌ఫెక్ట్‌గా చేయాలి. జంతువులంటే ఇష్టం ఉండాలి. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండాలి’ అని అదా తెలిపారు .

Recent Articles English

Gallery

Recent Articles Telugu