Homeపొలిటికల్జనసేనకు 24 సీట్లు.. అడిగే హక్కు మనకు ఉందా? : హైపర్‌ ఆది

జనసేనకు 24 సీట్లు.. అడిగే హక్కు మనకు ఉందా? : హైపర్‌ ఆది

Hyper aadi video on pawan k

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్ద అభిమాని అని అందరికీ తెల్సిందే. జనసేన కార్యకర్తగా స్టేజిపై ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. ఎంతోమందిని విమర్శించాడు కూడా. పవన్ కళ్యాణ్‌ ను ఎవరైనా ఏదైనా అంటే.. డైరెక్ట్‌గా అయినా.. ఇన్ డైరెక్ట్‌గా అయినా వారికి తనదైన స్టైల్లో కౌంటర్‌ ఇస్తాడు. ఇక తాజాగా హైపర్ ఆది ఎమోషనల్ అయ్యాడు.

టీడీపీ- జనసేన పొత్తులో జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో పవన్ అభిమానులే ఆయనను దుయ్యబట్టారు. ఈ విషయమై హైపర్ ఆది ఒక వీడియోను విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే రకం కాదు, సినిమాలు చేస్తూ కోట్లు గడించే సత్తా ఉన్నా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని చెప్పుకొచ్చాడు.

‘ఎటువంటి అవినీతి చేయకుండా.. తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే.. నిజంగా బాధ అనిపించింది. అంటే 24 సీట్లు ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడుతున్నారు. 2019 లో కనీసం ఆయనను కూడా గెలిపించుకోలేని మనం. అదేంటి, ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉంది అంటారా ? ఒక చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఒక పదిరోజులు ఇంట్లో నుంచి బయటికురాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండో రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది.

తన పిల్లల కోసం బ్యాంక్ లో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన మన పవన్ కళ్యాణ్ గురించా ఇలా మాట్లాడేది. ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. రోజుకు రెండుకోట్లు తీసుకొనే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయకార్యక్రమాలకు పెట్టేసి, ఆల్మోస్ట్ అప్పుచేసి పార్టీని నడుపుతున్నాడు అని ఎంతమందికి తెలుసు. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అనేవాళ్లే కానీ, ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వారి జేబులో నుంచి ఒక రూపాయి తీసి సహాయం చేశాడా.. ? అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.

అలాంటి వ్యక్తిని పట్టుకొని కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టాడు. ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నారు. అమ్మలాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తా పవన్ కళ్యాణ్ గారు. డబ్బుకు అమ్ముడుపోతాడా.. ? ప్రతిపక్షంలో టీడీపీ కంటే.. అధికారిక పక్షంలో ఉండే వైసీపీలో ఎక్కువ డబ్బు ఉంటుందిగా.. మరి అక్కడకు ఎందుకు వెళ్ళలేదు. ఎందుకండీ ఈ మాటలు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల ప్రేమకు బానిసలు కానీ, నాయకులు పంచే డబ్బుకు ఎప్పటికీ బానిస కాదు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండడాన్నే నిజమైన అభిమానం అంటారు. ఎవరో రెచ్చగొట్టే, జాలి చూపించే మాటలు విని మన నాయకుడును తక్కువ చేసి మాట్లాడకూడదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu