హైదరాబాద్‌లో VFX Summit 2023 ఈవెంట్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి అక్కినేని నాగార్జున అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ టెక్నికల్ అంశాల గురించి తనకు అంత పెద్దగా తెలియదని అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లోని తన టీమ్ మాత్రం అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి తనను అప్‌డేట్ చేస్తూనే ఉంటుందని అన్నారు. మా కుటుంబం చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఫిల్మ్ స్టూడియోని స్థాపించడంలో మార్గదర్శకులుగా ఉన్నామన్నారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీని చూస్తుంటే చాలా ఆనందం
వేస్తోందని అన్నారు.
మన హైదరాబాద్ భారతదేశ చలనచిత్ర రాజధానిగా మారుతుందని నాగార్జున అన్నారు. తెలుగు వారికి సినిమాలంటే ప్రాణం. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కలెక్షన్లు మిగతా అన్ని రాష్ట్రాల కలెక్షన్లతో సమానంగా ఉంటాయి అన్నారు.
ఇప్పుడు దేశం మొత్తం మన దక్షిణాది సినిమాలను ఫాలో అవుతున్నాయి. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను అన్నారు. సౌత్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో మా ఉనికిని చాటుకున్నాం అన్నారు.
ఈ ఎక్స్‌పో ఏర్పాటుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్‌పోకు రావాలని తెలిపారు.