Hyderabad Drunk and Drive:
హైదరాబాద్‌లో నిన్న రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వింత సంఘటన జరిగింది. వేంగలరావు పార్క్ దగ్గర రాత్రి 10:50కి పోలీసులు ఒక బైక్‌ను ఆపి తనిఖీ చేయగా, బ్రీత్‌లైజర్ టెస్టులో 550 mg/100ml మద్యం మోతాదుతో వ్యక్తిని పట్టుకున్నారు. ఈ సంఖ్య సాధారణ అనుమతితర మోతాదిని ఎంతగానో మించిపోయింది.
బైక్ నంబర్ TS09EK3617 ఉన్న ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేసి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “ఎంత తాగావ్ బ్రో?” వంటి కామెంట్లతో నెటిజన్లను ఆకట్టుకుంది.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరిగాయి. రాచకొండ పోలీసు నివేదిక ప్రకారం, అత్యధిక కేసులు 21-30 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో నమోదయ్యాయి.
వాహనాల వారీగా కేసులు:
రెండు చక్రాల వాహనాలు: 526 కేసులు
నాలుగు చక్రాల వాహనాలు: 64 కేసులు
మూడు చక్రాల వాహనాలు: 26 కేసులు
వయస్సు ఆధారంగా నమోదు అయిన కేసులు:
21-30 ఏళ్లు: 262 కేసులు
31-40 ఏళ్లు: 201 కేసులు
41-50 ఏళ్లు: 109 కేసులు
ALSO READ: Unstoppable షోలో Ram Charan వేసుకున్న హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!