అనుష్క ఏంటి..? హైదరాబాద్ రోడ్ మీద ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? మీరు
వింటున్నది నిజమే. అసలు విషయంలోకి వస్తే ‘సైజ్ జీరో’ సినిమా కోసం స్వీటీ బాగా
బరువు పెరిగింది. ఇప్పుడు తగ్గడానికి అమ్మడు చేయని ప్రయత్నం లేదు. బాహుబలి2
షూటింగ్ లో అనుష్క చేయాల్సిన సన్నివేశాలు అలానే మిగిలి ఉన్నాయి. రాజమౌళి
కూడా రెండు సార్లు అనుష్కకు గట్టిగా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. అమ్మడు మాత్రం లైపో
చేయించుకోకుండా.. న్యాచురల్ పద్ధతుల్లోనే తగ్గుతానని చెబుతోంది. ఇందులో భాగంగా
సైకిల్ తొక్కుతోందట. అది కూడా హైదరాబాద్ రోడ్ల మీద.. ఎవరూ తనని గుర్తుపెట్టకుండా
ఉండాలని ముఖానికి మాస్క్ కట్టుకొని రోజు ఉదయం సుమారుగా ఇరవై కిలోమీటర్ల వరకు
సైకిల్ తొక్కుతుందని సమాచారం. స్వీటీ పడుతోన్న తిప్పలు ఎప్పటికీ తగ్గుతాయో చూడాలి!