బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. బేబీ మూవీపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నిర్మాతకు నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
బేబీ సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయని సీపీ మండిపడ్డారు. డ్రగ్స్ ఎలా ఉపయోగించాలో అనేదానిపై కొన్నిసన్నివేశాలు చూపించారని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు చేసిన సమయంలో జరిగిన సన్నివేశాలు బేబీ సినిమాలో ఉన్నాయని పోలీస్ కమిషనర్ అన్నారు.
అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి కమిషనర్ సూచనలు చేశారు. ఇకనుంచి ప్రతి సినిమాపై నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు.
డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి సైతం ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని, డ్రగ్స్‌కు వినియోగదారుడిగా ఉన్న నవదీప్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామన్న ఆయన.. నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో నిర్మాత కూడా పరారీలో ఉన్నట్లు తెలిపారు.