HomeTelugu Big Storiesమహిళలూ ఆపదలో ఈ నెంబర్లను మరవొద్దు

మహిళలూ ఆపదలో ఈ నెంబర్లను మరవొద్దు

9 26
తమ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు వారిని బయటకు పంపించాలంటేనే వణికిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మనిషి ముసుగులో తిరుగుతున్న మృగాలు కామోన్మాదంతో రెచ్చిపోతున్నారు. ఆడపిల్లలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. పసి పిల్లల నుంచి ఏ వయసుల వారినైనా వారి కామ దాహానికి బలైపోతున్నారు. దేశంలో నిత్యకృత్యంగా జరుగుతున్న ఇలాంటి దారుణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ శివారులో యువతి, పశువైద్యురాలు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అతి క్రూరంగా హత్యాచారం చేశారు. అలాగే వరంగల్‌ జిల్లాలో మరో ఘటన.. పుట్టిన రోజునే యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఒకేరోజు జరిగిన ఈ రెండు ఘటనలు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

సమాజంలో ఇలాంటి దారుణాలను, మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసినా కొంత వరకే నేరాలను నియంత్రించగలుగుతున్నాయి. తాజాగా జరిగిన రెండు ఘటనలతో అమ్మాయిల భద్రతపై తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వారికి ధైర్యాన్నిచ్చేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అమ్మాయిలకు ఏ ఆపద వచ్చినా.. వారెలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. వాహనాలు ఆగిపోయినా.. దయచేసి 100 నంబర్‌కు డయల్‌ చేయాలని పలువురు మంత్రులు, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటికే భద్రతకు సంబంధించి అనేక టోల్‌ఫ్రీ నంబర్లు ఉన్నప్పటికీ.. ఆపదలో చిక్కుకున్న సమయంలో వాటిపై సరైన అవగాహన లేక చాలామంది యువతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా శంషాబాద్‌ ఘటనలోనూ అదే జరిగింది. బుధవారం రాత్రి ఆమె తన సోదరితో ఫోన్‌లో మాట్లాడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే జీపీఎస్‌ ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని.. ఈ ఘోరాన్ని నివారించగలిగేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆపదలో ఉన్నప్పుడు భద్రతాపరంగా సహాయపడే కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లపై యువతులు, మహిళలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో దిగువ పేర్కొన్న నంబర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపడితే అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించే వీలుంటుంది. వీటిని మరవకండి
* డయల్‌-100
* దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1090, 1091
* తెలంగాణ ‘షి’ టీమ్స్ నెంబర్ : 040-27852355 లేదా వాట్సాప్‌ నంబరు 94906 16555కు ఫిర్యాదు చేయవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu