Homeపొలిటికల్ఒక్క సంవత్సరంలో Hyderabad Drunk Drive Result చూస్తే మతి పోవాల్సిందే!

ఒక్క సంవత్సరంలో Hyderabad Drunk Drive Result చూస్తే మతి పోవాల్సిందే!

Hyderabad Drunk Drive Result from January 1st will shock you!
Hyderabad Drunk Drive Result from January 1st will shock you!

Hyderabad Drunk Drive Result:

హైదరాబాద్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపే కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2024 జనవరి 1 నుండి నవంబర్ 26 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 53,234 కేసులు నమోదు చేయాగా, రూ. 10.69 కోట్ల జరిమానా వసూలు చేశారు.

కేసుల వివరాలు:

45,394 కేసులు ద్విచక్ర వాహనదారులపై, 5364 కేసులు నాలుగు చక్రాల వాహనదారులపై, 2407 కేసులు మూడు చక్రాల వాహనదారులపై, 69 ఇతర వాహనాలపై నమోదయ్యాయి.

అందులో మళ్ళీ 2283 మంది ద్విచక్ర వాహనదారులు రెండోసారి పట్టుబడ్డారు.101 మంది మూడోసారి, 19 మంది నాలుగోసారి మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించారు.

మొదటిసారి తప్పు చేసిన 3750 మందిని జైలుకు పంపించారు. వారికి విధించిన శిక్షలు ఒకరోజు నుండి 60 రోజుల వరకు ఉన్నాయి. 92 మందికి ఒకరోజు శిక్ష, 12,666 మందికి రెండు రోజులు, 1985 మందికి నాలుగు రోజులు, 14 మందికి 10 రోజులు, ఒకరికి మాత్రం ఒక నెల జైలు శిక్ష విధించారు. 573 మందిని సామాజిక సేవ చేయాల్సిందిగా ఆదేశించారు.

వివిధ ఉల్లంఘనల కారణంగా 331 డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడపడం ఒక పెద్ద నేరమని హెచ్చరిస్తున్నారు. ఈ చర్యలు మన జీవితాలను కాపాడటానికి, రోడ్ల భద్రతను పెంచేందుకు అవసరమని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయా ఇలాంటివి జరుగుతూ ఉండడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరిస్తే, ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు.

ALSO READ: Bigg Boss 8 Telugu లో ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టం!

Recent Articles English

Gallery

Recent Articles Telugu