టాలీవుడ్ హీరో యంగ్ ఎన్టీఆర్ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వాటిలో పోస్ట్ చేసే సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా సైబర్ మోసాలకు సంబంధించి ఎన్టీఆర్‌తో వీడియోను రూపొందించారు.
ఈ వీడియోలో యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఎదురైన చేదు అనుభవాన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దైర్యంగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
— Hyderabad City Police (@hydcitypolice) October 8, 2020