సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ ‘2.0’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి.
విధ్యాబాలన్ ను ఇక ఫైనల్ కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో హుమా ఖురేషీను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ సరసన ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాగా ఎగ్జైట్ అవుతోందట. ఈ నెలాఖరు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.